e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News రాశి ఫలాలు

రాశి ఫలాలు


28.3.2021 నుంచి 3.4.2021 వరకు

మేషం
వ్యాపార విస్తరణకు అనుకూలమైన వారం. కొంత అప్రమత్తతతో వ్యవహరించాలి. వివాదాల్లోకి వెళ్లకుండా సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. భూములు, గృహనిర్మాణ పనులలో కొంత జాప్యం జరిగినా చివరికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అందరితో చర్చించి పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల అండదండలు, తోటి ఉద్యోగుల సహకారం లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పులు తీరుస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఖర్చులున్నా ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు.

వృషభం
రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. ఖర్చు అయినా ఫలితాలు అనుకూలంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలం. సమయాన్ని సద్వినియోగ పరచుకోవడంతో మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల లాభాలు, ప్రతిఫలాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలించి శుభకార్యాలు చేస్తారు. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. ఆదాయంలో కొంత హెచ్చుతగ్గులున్నా పనులకు సరిపడా డబ్బు ఏదో రకంగా చేతికి అందుతుంది. పనులు పూర్తవుతాయి. సమాజంలో అందరి ఆదరణ, సహకారం లభిస్తాయి. ప్రయాణాలవల్ల అలసట, వృథా ఖర్చులు ఉండవచ్చు.

మిథునం
పిల్లల విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనుల ప్రారంభాన్ని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నిత్య వ్యాపారం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలున్నా పిల్లల విషయంలో శ్రద్ధ కనబరుస్తారు. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనడంలో ఆలస్యం జరుగవచ్చు. వారాంతంలో కొనే అవకాశం ఉంటుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహితులవల్ల ఖర్చులు పెరగవచ్చు. కొన్ని విషయాలలో అప్రమత్తత అవసరం. రావలసిన డబ్బు అందక పోవడంతో ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహాయంతో ముందుకు సాగుతాయి.

కర్కాటకం
తలపెట్టిన పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కార్యసాఫల్యం, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక వేత్తలకు సిబ్బందితో ఆనుకూలత ఉంటుంది. వ్యవసాయదారులకు సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము కొంత జాప్యమైనా చేతికి అందుతుంది. పనులు కలిసి వస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పెద్దలను గౌరవిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.

సింహం
మంచి ఆలోచనలు స్ఫురించడంతో ఆచరణలో పెడతారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. వివాదాలు, కలహాలకు దూరంగా ఉంటారు. కొత్త స్నేహితుల పరిచయం, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలపై మనసు నిలపడం అవసరం. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పనులు సంతృప్తిగా చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురిలో గౌరవ మర్యాదలతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల విషయంలో భక్తిభావన పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలించి ఉద్యోగంలో చేరవచ్చు. ఆదాయం స్థిరపడి క్రమేపీ పెరుగుతుంది.

కన్య
మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. పనులలో అనుకూలత ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులు, ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. స్నేహితులవల్ల కొంత ఖర్చు పెరగవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. సిబ్బందితో స్నేహంగా ఉంటూ, పనులు పూర్తి చేసుకుంటారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. వాహనాల విషయంలో ఖర్చులు ఉండవచ్చు. చిన్నపాటి ఆర్థిక సమస్యలవల్ల పనులు కొంత ఆలస్యంగా పూర్తి కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంతో పనులు నిర్వర్తిస్తారు. పిల్లల చదువుపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తి ఉంటుంది. లాభాలు ఉంటాయి.

తుల
ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో అందరితోనూ స్నేహంగా ఉంటూ, పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులవల్ల పనులలో జాప్యం ఉండవచ్చు. స్నేహితులు, బంధువర్గంతో వివాదాల్లోకి వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం అవసరం. రావలసిన డబ్బు అందుతుంది. ఖర్చులు అనూహ్యంగా పెరగవచ్చు. సర్దుబాట్లు, చేబదులు అవసరం పడవచ్చు. ఆస్తులు, భూముల విషయంలో తగాదాలు ఉంటాయి. జాగ్రత్తగా పరిష్కరించుకోవడం అవసరం. వృత్తి, వ్యాపారాలపై మనసు నిలుపడం అవసరం. శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం లభిస్తుంది.

వృశ్చికం
రావలసిన డబ్బు సమయానికి చేతికి అందడంతో గత అప్పులు చెల్లిస్తారు. సంతృప్తిగా ఉంటారు. సిబ్బందితో స్నేహంగా ఉంటారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా, లాభసాటిగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. కోర్టు సమస్యలు తీరుతాయి. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటూ, పనులు పూర్తి చేసుకుంటారు. కావలసిన వస్తువులను కొంటారు. సినిమా, సంగీత సాహిత్యాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా క్రమేపీ పెరుగుతుంది. వాహనాలవల్ల ఖర్చులున్నా పనులు పూర్తవుతాయి. స్నేహితుల రాక సంతృప్తినిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

ధనుస్సు
సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మనసు నిలిపి చదవడంతో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారం అనుకూలిస్తుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. సమాజంలో అందరి సహకారం లభిస్తుంది. కుటుంబపెద్దల సూచనలతో పనులు నిర్వహిస్తారు. అందరితో ప్రేమభావంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో చేరవచ్చు. ప్రయత్నాలు కలిసివచ్చి శుభకార్యాలు చేస్తారు. ఆదాయంలో కొన్ని హెచ్చుతగ్గులున్నా పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆఫీసులో మంచిపేరు పొందుతారు. పాత పెట్టుబడులవల్ల ఆదాయం పెరుగుతుంది. క్రయవిక్రయాలు లాభిస్తాయి.

మకరం
గతంలోని న్యాయ సమస్యలు తొలగుతాయి. సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. పారిశ్రామిక వేత్తలకు కార్మికులతో చిన్నపాటి ఇబ్బందులున్నా ఉత్పాదన సంతృప్తిగానే ఉంటుంది. ఆఫీసులో తోటివారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల మన్ననల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. కావలసిన వస్త్ర, వస్తువులను కొంటారు. సమాజంలో పెద్దల సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నిస్తారు. వాహనాలవల్ల అనూహ్యంగా ఖర్చులు ముందుకు వస్తాయి. అన్నదమ్ములు, ఆత్మీయులతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు.

కుంభం
శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలం అందుతుంది. క్రయవిక్రయాలు లాభసాటిగానే ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులకోసం కొంత ఆలోచన అవసరం, లేదా కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులు, బంధువర్గంతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సహకారానికి ప్రయత్నిస్తారు. వాహనాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలవల్ల ఆటంకాలు ఉంటాయి. కొన్ని పనులలో ఆలస్యం వల్ల నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది.

మీనం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని సరైన సమయంలో ఆచరణలో పెడతారు. మంచి ఫలితాలు పొందుతారు. పనులపై మనసు నిలుపుతారు. గత అప్పులు వసూలవుతాయి. ఋణాలు తీరుస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆఫీసులో ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకై ఆలోచిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన వారం. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. బంధువులు, వారి రాకతో కొన్ని ఖర్చులున్నా సంతోషంగా ఉంటారు.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాశి ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement