e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News రాశి ఫలాలు, 5.12.2021 నుంచి 11.12.2021 వరకు

రాశి ఫలాలు, 5.12.2021 నుంచి 11.12.2021 వరకు

మేషం
స్వయం ఉపాధి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అయితే, సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. సమాజంలో మంచిపేరు పొందుతారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల వారం. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది.

వృషభం
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భక్తి పెరుగుతుంది. పెద్దలను గౌరవిస్తారు. నలుగురితో సత్సంబంధాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు తోటివారితో సంయమనంతో ఉండటం అవసరం. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆదాయం స్థిరంగా ఉన్నా, అనుకోని ఖర్చులు రావచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెండింగ్‌లో ఉన్న పనులు కొంతవరకు పూర్తవుతాయి. కోర్టు కేసులలో ఖర్చులు పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.

- Advertisement -

మిథునం
విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగ్గుతారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. పదోన్నతులు, స్థానచలనం అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారంతో పనులు సంతృప్తిగా పూర్తిచేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తిగా ఉండటంతో కొత్త పనులపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. న్యాయ పరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కార్యసాఫల్యం ఉంది. పట్టుదలతో పనులు చేస్తారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం.

కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల అవసరం. ప్రభుత్వ పనులలో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగులకు పై అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కార్య సాఫల్యత ఉన్నప్పటికీ, వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి.

సింహం
ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో పనులను సమర్థంగా పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరతారు. కొన్ని విషయాల్లో తాత్కాలికంగా నిరుత్సాహం కలగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కళాకారులకు ఈ వారం అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.

కన్య
ఇంటా, బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కార్యసాఫల్యం ఉంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు. కొత్త పనులు, వ్యాపార విస్తరణ వాయిదా పడుతాయి. నలుగురిలో మాట పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలు ఉల్లాసంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అనుకూల వారం. ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది.

తుల
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పనులకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఇంటి పెద్దలతో అన్ని విషయాలను చర్చించి, అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంయమనంతో పనులు పూర్తిచేసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. తీర్థయాత్రలు, విహార యాత్రలు వాయిదా పడతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. స్నేహితుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు.

వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వినోద, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళతారు. ఆదాయం స్థిరంగా ఉన్నా, పనుల్లో జాప్యం జరగవచ్చు. వాహనం, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

ధనుస్సు
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారం సంతృప్తిగా సాగుతుంది. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనుల మూలంగా ఖర్చులున్నా అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు పలకరిస్తాయి. సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు చేపడతారు. భక్తి పెరుగుతుంది.

మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణతో కార్యసాఫల్యం ఉంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నూతన నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధువుల రాకతో సంతృప్తిగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తి పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేపడతారు. అవగాహనతో ముందుకు వెళతారు. సత్ఫలితాలను పొందుతారు. ఆస్తి
తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

కుంభం
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంటుంది. వ్యాపారులకు న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు తోటివారితో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణతో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

మీనం
అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయట పడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురికి సాయపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement