e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home General సూపర్‌ మార్కెట్లో 8 అడుగుల రాకాసి బల్లి.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు

సూపర్‌ మార్కెట్లో 8 అడుగుల రాకాసి బల్లి.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు

సూపర్‌ మార్కెట్లో 8 అడుగుల రాకాసి బల్లి.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు

థాయ్‌ లాండ్‌ లోని ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి కస్టమర్లు పరుగులు తీశారు. కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. విషయం ఏంటటే సూపర్‌ మార్కెట్‌ లో ఓ రాకాసి బల్లి అందరినీ భయపెట్టింది. 8 అడుగుల పొడవు, భారీ శరీరంతో ఉన్న ఆ బల్లిని చూడగానే కస్టమర్లు భయపడ్డారు. కేకలు వేయడంతో ఆ రాకాసి బల్లి కూడా హడలిపోయింది. మనుషులు తనకి హాని చేస్తారేమోనన్న భయంతో అది సూపర్‌ మార్కెట్లోని ర్యాక్‌ లపై ఎక్కి గోడ మీదకు చేరింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ గా మారింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఈ రాకాసి బల్లిని బంధించి అడవుల్లో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఇంత భారీ దేహంతో భయానకంగా కనిపించినా ఈ రాకాసి బల్లులతో ఎలాంటి ప్రాణహాని ఉండదంటున్నారు జంతుప్రేమికులు. బయట ఎండ వేడికి తట్టుకోలేక సూపర్‌ మార్కెట్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
సూపర్‌ మార్కెట్లో 8 అడుగుల రాకాసి బల్లి.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement