e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News బిల్డింగ్‌పై నుండి కింద ప‌డ్డ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

బిల్డింగ్‌పై నుండి కింద ప‌డ్డ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

బిల్డింగ్‌పై నుండి కింద ప‌డ్డ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

ఇటీవలి కాలంలో చాలామంది న‌టులు షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం బారిన ప‌డుతున్నారు.మొన్నామ‌ధ్య క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి పెట్రోల్ బాంబ్ విసిరేస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. తాజాగా మ‌ల‌యాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్ షూటింగ్ స‌మ‌యంలో బిల్డింగ్ పై నుండి కింద ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు చిన్న‌పాటి గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. మ‌ల‌య‌న్ కుంజ్ అనే చిత్ర షూటింగ్‌లో ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌గా, కింద ప‌డ్డ వెంట‌నే అత‌డిని కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. 

ప్ర‌మాదంలో ఫాహ‌ద్ ఫాజిల్ ముక్కుకు గాయాల‌య్యాయ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని అంటున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్దిస్తున్నారు.  బెంగ‌ళూరు డేస్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫహ‌ద్.. న‌టి న‌జ్రియాను పెళ్ళి చేసుకున్నాడు. న‌జ్రియా ..నాని న‌టించిన అంటే సుంద‌రానికి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిల్డింగ్‌పై నుండి కింద ప‌డ్డ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

ట్రెండింగ్‌

Advertisement