e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News పాకిస్తాన్‌కు స‌మ‌స్య‌గా మార‌నున్న అల్ ఖైదా వంటి సంస్థ‌లు.. అమెరికన్ జ‌న‌ర‌ల్ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్‌కు స‌మ‌స్య‌గా మార‌నున్న అల్ ఖైదా వంటి సంస్థ‌లు.. అమెరికన్ జ‌న‌ర‌ల్ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్‌కు స‌మ‌స్య‌గా మార‌నున్న అల్ ఖైదా వంటి సంస్థ‌లు.. అమెరికన్ జ‌న‌ర‌ల్ హెచ్చ‌రిక‌

ఇస్లామాబాద్: అల్ ఖైదా వంటి సంస్థ‌ల‌తో పాకిస్తాన్‌కు పెద్ద స‌మ‌స్య పొంచివున్న‌ద‌ని అమెరికాకు చెందిన జ‌న‌ర‌ల్ హెచ్చ‌రించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ త‌న‌ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత‌ ఉగ్రవాదులు తిరిగి పెరిగి పోయేందుకు ప్రయత్నిస్తార‌ని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థలు పాకిస్తాన్‌కు మరింత త‌ల‌నొప్పిగా త‌యార‌వుతాయ‌ని, ఇతర పొరుగు దేశాలు కూడా ఈ సంస్థలచే ప్రభావితమవుతాయ‌ని పెంటగాన్ మీడియా సమావేశంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ జూనియర్ కమాండర్ జనరల్ కెన్నెత్ ఎఫ్ మెకెంజీ ఈ సమాచారం ఇచ్చారు.

నిరంతరం ఒత్తిళ్లు తీసుకురాక‌పోతే ఈ సంస్థలు తిరిగి కలిసే సామర్థ్యం పొందుతాయ‌ని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్ యొక్క అన్ని పొరుగు దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. సమస్యను పరిష్కరించడానికి యూఎస్ మిలటరీ, దౌత్యవేత్తలు చుట్టుపక్కల దేశాలతో యూఎస్ సైనిక స్థావరాలను నిర్మించే ఒప్పందంపై అన్వేషిస్తున్నారని మెకంజీ చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల‌లో యూఎస్ సైనిక కార్యకలాపాలకు జనరల్ మెకెంజీ బాధ్యత వహిస్తున్నాడు.

చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌లు పరిష్కారం : ఖురేషి

మరోవైపు, భారత్‌తో ఉన్న అన్ని వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించాలని పాకిస్తాన్ కోరుకుంటుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి అన్నారు. 2019 ఆగస్టు 5 న కశ్మీర్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను భారత్ మొదట పునఃపరిశీలించాల‌ని ఆయ‌న సూచించారు. టర్కీ మీడియాతో మాట్లాడిన‌ పాక్ విదేశాంగ మంత్రి.. భారతదేశంతో చర్చలు జ‌రుప‌డానికి మాకు ఎలాంటి సమస్య లేదని, అయితే వారు తొలుత‌ కశ్మీర్‌ను చర్చల కోసం పరిగణించాలన్నారు. పాకిస్తాన్-భారతదేశం మధ్య చాలా సమస్యలు ఉన్నాయని, వీట‌న్నింటినీ చర్చల ద్వారా పరిష్కరించగలమని షా మెహమూద్ అన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

వివాదాస్పద ద్వీపాల వ‌ద్ద‌ ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు

స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత‌

అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్ర‌స్‌లు

ఇత‌ను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైర‌ల్‌

యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం

స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహ‌ర‌ణ..!

ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో స‌ర్వేలో వెల్ల‌డి

30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. క‌శ్మీర్‌లోని ఓ ఊరి క‌థ‌

మే నెల‌లో బాంకుల‌కు 12 సెల‌వులు.. త‌గ్గ‌నున్న ప‌ని గంట‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాకిస్తాన్‌కు స‌మ‌స్య‌గా మార‌నున్న అల్ ఖైదా వంటి సంస్థ‌లు.. అమెరికన్ జ‌న‌ర‌ల్ హెచ్చ‌రిక‌

ట్రెండింగ్‌

Advertisement