e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home News న‌వీన్, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌భాస్ ఇంట్లోకి రానివ్వ‌ని సెక్యూరిటీగార్డు..వీడియో

న‌వీన్, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌భాస్ ఇంట్లోకి రానివ్వ‌ని సెక్యూరిటీగార్డు..వీడియో

న‌వీన్, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌భాస్ ఇంట్లోకి రానివ్వ‌ని సెక్యూరిటీగార్డు..వీడియో

అనుదీప్ కేవీ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ జాతిరత్నాలు. న‌వీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామకృష్ణ కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు, పాట‌కు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. కాగా తాజాగా జాతిర‌త్నాలు ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ లాంఛ్ చేశాడు. అయితే న‌వీన్‌, ఫరియా, ప్రియ‌ద‌ర్శి అండ్ టీం స‌రికొత్త‌గా ట్రైల‌ర్ లాంఛింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

జోగిపేట్ టు ముంబై అంటూ విమానంలో టీం ప్ర‌భాస్‌ను క‌లిసేందుకు ముంబై వెళ్లింది. ప్ర‌భాస్ ను క‌లిసేందుకు జోగిపేట్ శ్రీకాంత్ అంటూ న‌వీన్‌-ప్రియ‌ద‌ర్శి ముంబైలోని ప్ర‌భాస్ ఇంటి ప్రాంగ‌ణంలోకి వెళ్లారు. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ గార్డు లోప‌లికి వెళ్లేందుకు అనుమ‌తి లేద‌ని వారిస్తాడు. సెక్యూరిటీ గార్డుతో న‌వీన్‌, ప్రియ‌ద‌ర్శి త‌గువులాడుతుంటే..ప‌క్క నుంచి డైరెక్ట‌ర్ అనుదీప్ గేట్‌లోపలికి వెళ్లిపోతాడు. ఆ వెంట‌నే న‌వీన్‌, ప్రియ‌ద‌ర్శి కూడా లోప‌లికి వెళ్లి ప్ర‌భాస్‌ను క‌లుసుకుంటాడు.

ప్ర‌భాస్ తో స‌ర‌దాగా మాట్లాడిన త‌ర్వాత ట్రైల‌ర్ ను లాంఛ్ చేయించాడు న‌వీన్. ట్రైల‌ర్ చూస్తున్నంత‌సేపు చాలా ఫ‌న్నీగా ఉంద‌ని, సినిమాను చాలా ఎంజాయ్ చేస్తార‌ని అన్నాడు ప్ర‌భాస్‌. మొత్తానికి ప్ర‌భాస్ అన్న‌తో ట్రైల‌ర్ లాంఛ్ చేసి స‌రికొత్త‌గా సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు న‌వీన్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
న‌వీన్, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌భాస్ ఇంట్లోకి రానివ్వ‌ని సెక్యూరిటీగార్డు..వీడియో
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement