e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News గాజీపూరు.. అభివృద్ధి జోరు..

గాజీపూరు.. అభివృద్ధి జోరు..

  • పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
  • ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ
  • వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, సీసీరోడ్ల నిర్మాణం
  • రోజూ గ్రామంలో పారిశుధ్య పనులు
  • పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతున్న ప్రధాన రహదారి

పెద్దేముల్‌, సెప్టెంబర్‌ 26: పల్లె ప్రగతి కార్యక్రమంతో గాజీపూర్‌ గ్రామంలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారంతో సర్పంచ్‌ తలారి వీరప్ప ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించి, అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని అన్ని కాలనీల్లో తాగునీటి సౌకర్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, మిషన్‌ భగీరథ నీరు, విద్యుత్‌, వైద్యం, మురుగుకాల్వలు, డంపింగ్‌ యార్డు నిర్మించారు. సీసీరోడ్డు, మురుగు కాల్వలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నారు.

పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు

- Advertisement -

పంచాయతీలో మొత్తం జనాభా 1,664 ఉండగా, 474 ఇండ్లు, 450 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో 2 మిషన్‌ భగీరథ ట్యాంకులు ఉన్నాయి. పంచాయతీ నిధులు రూ.3 లక్షలతో ఎస్సీ కాలనీలో, రూ.2 లక్షలతో బీసీ కాలనీలో, రూ.లక్షతో 7వ వార్డులో మురుగు కాల్వలు, రూ.2 లక్షలతో సీసీ రోడ్లకు మరమ్మతులు, రూ.2 లక్షలతో మురుగు కాల్వలకు బెడ్‌లు, రూ.2 లక్షలతో సంగమేశ్వర వాగు వద్ద కొత్త బోర్‌ మోటార్‌, 10వ వార్డులో రూ.2 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించారు. జడ్పీ నిధులు రూ.2 లక్షలతో బోనమ్మ గుడి వద్ద నూతనంగా బోర్‌ మోటార్‌, రూ.2 లక్షల జడ్పీ నిధులతో పాఠశాలకు ప్రహరీ నిర్మించారు. రూ.1,50లక్షలతో రోడ్లకు ఇరువైపులా మొరం పనులు, రూ.50 వేలతో మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. బీసీ కాలనీలో రూ.4.10 లక్షలు, మరోచోట రూ.4 లక్షలతో రోడ్లకు చిల్ప, మొరంతో మరమ్మతులు చేయించారు. 7వ వార్డులో రూ.4 లక్షలతో ఫార్మేషన్‌ రోడ్డు, రూ.40 వేలతో నర్సరీ ఏర్పాటు చేసి, 11 వేల మొక్కలు నాటారు. శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లు, పాడుబడ్డ బావులు పూచ్చివేశారు. గ్రామంలోఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. రూ.6 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో సీసీ రోడ్డు పనులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో భాగంగా రూ.12 లక్షలతో పంచాయతీ నూతన భవన పనులు కొనసాగుతున్నాయి. రూ.45వేలతో డంపింగ్‌ యార్డు, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2.40 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.7.50 లక్షలతో పంచాయతీ ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు.

గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా..

పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిని సక్రమంగా, ప్రణాళికా బద్ధంగా వాడుతున్నాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం.
తలారి వీరప్ప, సర్పంచ్‌, గాజీపూర్‌

గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలు

గాజీపూర్‌ పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సహకారాలు అందిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే డంపింగ్‌యార్డు, కంపోస్టు షెడ్డు, నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాం. తాండూరు ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాం. ఆయా కాలనీల్లో ప్రధాన రోడ్లకు చిల్ప, మొరంతో మరమ్మతులు చేశాం.
రాములు, పంచాయతీ కార్యదర్శి, గాజీపూర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement