e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : కరోనా రెండో దశ ఉప్పెనను అధిగమించడం పెద్ద సవాలేనని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. శుక్రవారం ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఎయిమ్స్‌లో ట్రామాసెంటర్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించి, ఆరోగ్య సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు.

సమాజంలో కరోనాపై నిర్లక్ష్యం పెరుగుతోందని పేర్కొన్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అందుకే ఆసుపత్రుల్లో పడకల సంఖ్య సైతం వేగంగా నిండుతోందన్నారు. వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వైద్యులనుద్దేశించి మాట్లాడుతూ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వానికి ఏడాది అనుభవం ఉందని, అందువల్ల కరోనాకు వ్యతిరేకంగా యుద్ధానికి గతంలో కంటే సిద్ధంగా ఉన్నారన్నారు.

అన్ని పద్ధతులు, మార్గదర్శకాలు తెలుసునని, ప్రస్తుత ఉపెనను ఎదుర్కొవడం సవాల్‌ అన్నారు. దవాఖానల్లో రోగులు, బంధువులకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

వైద్యులనుద్దేశించి మాట్లాడుతూ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వానికి ఏడాది అనుభవం ఉందని, అందువల్ల కరోనాకు వ్యతిరేకంగా యుద్ధానికి గతంలో కంటే సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని పద్ధతులు, మార్గదర్శకాలు తెలుసునన్నారు. కొవిడ్‌ కేసుల ప్రస్తుత ఉప్పెనను ఎలా అధిగమించడమే సవాలన్నారు. దవాఖానల్లో రోగులు, బంధువులకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 1,185 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరగా.. 1,25,47,866 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 1,74,308 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి..

ఈనెల 30 వ‌ర‌కు గురుకుల‌సెట్‌ దర‌ఖాస్తులు
నీట్‌-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్‌ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్‌ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్‌ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

ట్రెండింగ్‌

Advertisement