e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఎవరి కోసమో ఎందుకు మారాలి?

ఎవరి కోసమో ఎందుకు మారాలి?


కథల ఎంపికలో రానాది ప్రత్యేక శైలి.
కమర్షియల్‌ పంథాలో ఆలోచిస్తాడు, కొత్తదనాన్ని అన్వేషిస్తాడు. అందుకే సక్సెస్‌ఫుల్‌ నటుడిగా నిలబడ్డాడు. క్యారెక్టర్‌ను పండించడానికి అవసరమైతే కండలను కొండల్లా పెంచేస్తాడు. అమాంతం బరువు తగ్గేస్తాడు. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఈ యువహీరో కథ నచ్చితే ఏ భాషా చిత్రమైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెబుతున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా నాలుగు నెలల కిందట ‘సౌత్‌ బే’ యూట్యూబ్‌ చానల్‌తో మరో సంచలనానికి తెరదీశాడు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

యూట్యూబ్‌ చానల్‌ ఐడియా..

ఎవరి కోసమో ఎందుకు మారాలి?


ఒక ప్రేక్షకుడిగా నేను ఇంటర్నెట్‌ ద్వారా ఎంతో కంటెంట్‌ని చూస్తున్నాను. ప్రేక్షకుల దారిలో నేను వెళ్లేందుకు మొన్నటి లాక్‌డౌన్‌ బాగా ఉపయోగపడింది. ఇప్పటివరకు మేమంతా సినిమాల ద్వారా కథలు చెప్పాం. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కూడా కథలు చెబుతున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలనుకున్నాను. అలాగే ఇప్పుడున్న జనరేషన్‌ ప్రపంచంతో ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియా ప్రభావమే అనుకోండి, ప్రసార మాధ్యమాల ద్వారానే కానీయండి.. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలుసుకుంటున్నారు. మారుతున్న టెక్నాలజీ, లైఫ్‌ైస్టెల్‌ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నది యువత. డిజిటల్‌ వరల్డ్‌తో మమేకం అవుతున్న యూత్‌ను ఉద్దేశించి ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ తీసుకొస్తే బాగుంటుందని భావించాం. అలా వచ్చిందే ‘సౌత్‌ బే’ యూట్యూబ్‌ చానల్‌.

‘సౌత్‌ బే’తో కొత్త అడుగు..
ఈ యూట్యూబ్‌ చానెల్‌ని 2020 నవంబర్‌లో ప్రారంభించాం. కొత్త కాన్సెప్ట్‌తో దీన్ని డిజైన్‌ చేశాం. సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నాం. వివిధ భాషల్లో పాప్‌ కల్చర్‌ కంటెంట్‌ని తీసుకొస్తున్నాం. 16 నుంచి 45 ఏండ్ల వయసున్న వ్యూయర్స్‌ని ఆకట్టుకోవడానికి, వాళ్లను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇందులో రకరకాల ప్రోగ్రామ్స్‌ చేస్తున్నాం. ప్రజలకు ఓటీటీల్లో చాలా కంటెంట్‌ అందుబాటులో ఉంటున్నది. అందువల్ల మా ప్రోగ్రామ్‌ కాన్సెప్ట్‌లను చాలా కొత్తగా ట్రై చేస్తున్నాం. ముఖ్యంగా యానిమేషన్‌ని యూట్యూబ్‌ షోల్లోకి తీసుకొస్తున్నాం. లైవ్‌ చాట్‌, గేమింగ్‌, న్యూస్‌, మ్యూజిక్‌, పాప్‌ మ్యూజిక్‌, ఫిక్షన్‌, నాన్‌-ఫిక్షన్‌ కంటెంట్‌తో ఆడియన్స్‌ను అలరించేలా ప్లాన్‌ చేశాం. యానిమేషన్‌ చాలా ఏండ్ల నుంచీ ఉన్నదే! కాకపోతే, ఇప్పటి వరకు పిల్లల కంటెంట్‌కే అది పరిమితమైంది. కానీ, మేం పెద్దల ప్రపంచంలోకి యానిమేషన్‌ను తీసుకొచ్చాం.

నెగెటివిటీ పట్టించుకోను
కెరీర్‌ మొదట్లో నాపై వచ్చిన నెగెటివ్‌ కామెంట్స్‌కి ఎక్కువగా రియాక్ట్‌ అయ్యేవాడ్ని. వాటికి రెస్పాండ్‌ కావాల్సిన అవసరం లేదని తర్వాత అనుకున్నా. మనల్ని అభిమానించే వాళ్లు మన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. వారి కోసం కష్టపడాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అంతేగానీ,
విమర్శకులను తృప్తి పర్చడానికి నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా మార్చుకుంటూ పోతే నా వ్యక్తిత్వం ఏముంటుంది? ‘నా పని ఇది, నేను చేయాల్సింది ఇదే’ అన్న మంత్రం మాత్రం నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.

భాషాభేదం ఉండదు
నా వరకైతే సినిమాలో కథ నచ్చితే చాలు, ఏ భాషా చిత్రమైనా
చేయడానికి వెనుకడుగు వేయను. 2010లో విడుదలైన ‘లీడర్‌’ తెలుగు సినిమా. అదొక రీజనల్‌ పొలిటికల్‌ సినిమా. తర్వాత 2011లో నేను చేసిన రెండో సినిమా హిందీలో వచ్చిన ‘దమ్‌ మారో దమ్‌’ డ్రగ్స్‌, క్రైమ్‌ నేపథ్యంలో వచ్చింది. హిందీ చిత్రమని అనుకోలేదు. కథ నచ్చి చేశానంతే! కథ ముఖ్యం గానీ, భాషా భేదాల గురించి నేనెప్పుడూ ఆలోచించను.

ఆ బాధ్యత నాది
సినిమా కథను ఎంచుకునే స్వేచ్ఛ నాకున్నప్పుడు.. దాన్ని సక్సెస్‌ చేయాల్సిన బాధ్యతా నాపైనే ఉంటుంది. మంచి సినిమాల్లో నటిస్తున్నానన్న తృప్తి ఉంది. ‘హాతీ మేరీ సాతీ’ త్వరలో విడుదల కానుంది. మనిషి, ఏనుగు మధ్య ఉన్న అనుబంధం కథాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది. తెలుగులో ‘విరాటపర్వం’ సెట్స్‌ మీదుంది. నక్సల్స్‌ తెరకెక్కుతున్న చిత్రమిది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎవరి కోసమో ఎందుకు మారాలి?

ట్రెండింగ్‌

Advertisement