e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News అమెరికా పార్ల‌మెంట్‌లో అంబేడ్క‌ర్‌కు నివాళులు

అమెరికా పార్ల‌మెంట్‌లో అంబేడ్క‌ర్‌కు నివాళులు

అమెరికా పార్ల‌మెంట్‌లో అంబేడ్క‌ర్‌కు నివాళులు

వాషింగ్టన్ : డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్‌ 130 వ జయంతితోపాటు బైషాఖీ పండుగ‌ ప్రాముఖ్యతను అంగీకరిస్తూ అమెరికా పార్లమెంటులో ఈ తీర్మానాన్ని సమర్పించారు. ఈ సంద‌ర్భంగా అంబేడ్క‌ర్‌కు అమెరికా పార్ల‌మెంట్ ఘ‌నంగా నివాళుల‌ర్పించింది. డాక్టర్ అంబేద్కర్ జయంతి ప్రతిపాదనను వరుసగా రెండవ సంవత్సరం యుఎస్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అంబేడ్క‌ర్‌ గొప్ప రాజ్యాంగ వాస్తుశిల్పిగా గుర్తు చేసుకున్నారు.

తీర్మానం సమర్పించిన తరువాత.. అంబేడ్క‌ర్ అటు భార‌త‌దేశానికి, ఇటు అమెరికాకు.. రెండింటికి స్ఫూర్తిదాయకం అని ఎంపీ రో ఖ‌న్యా ట్వీట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ చేసిన గొప్ప పనిని గుర్తుచేసుకుంటూ మరోసారి ప్రతినిధుల సభలో తీర్మానాన్ని తీసుకువస్తున్నాను. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛపై డాక్టర్ అంబేడ్క‌ర్ అభిప్రాయాలు పౌరులందరికీ సమాన హక్కులను బోధిస్తాయన్నారు.

ఇదే సంద‌ర్భంగా బైషాఖీ పండుగ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన రెండవ తీర్మానాన్ని తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినప్పుడు కాలిఫోర్నియా ఎంపీ జాన్ గార్మెండి మాట్లాడారు. బైషాఖీకి చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఉన్న‌ద‌ని, సిక్కులతో పాటు హిందువులు, బౌద్ధ సమాజానికి ఇది చాలా ముఖ్యమైన ప‌ర్వ‌దిన‌మ‌ని చెప్పారు. బైషాఖీని అమెరికాలో సిక్కులు, హిందువులు విస్తృతంగా జరుపుకుంటారు. పెద్ద ఊరేగింపులు నిర్వహిస్తారు.

డాక్టర్ అంబేద్కర్ మా ప్రేరణ: జైస్వాల్

డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్క‌ర్‌ 130 వ జయంతి సందర్భంగా భారతదేశ కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ న్యూయార్క్‌లో ఘ‌నంగా నివాళులు అర్పించారు. డాక్టర్ అంబేడ్క‌ర్ ఒక సామాజిక సంస్కర్తగా మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌కు చెందిన శ్రీ గురు రవిదాస్ సభ నిర్వహించింది.

ఇవి కూడా చదవండి..

పాకిస్తాన్‌లో ఆందోళ‌న‌‌లు.. ఏడుగురు మృతి

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

టీకా ఆఫ‌ర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోట‌ల్స్‌

స‌ముద్రంలో వంద‌లాది ప‌డ‌వ‌ల మోహ‌రింపు.. ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న పీఎల్ఏ

క‌చ్ వ‌ద్ద పాకిస్తానీయుల ప‌ట్టివేత‌.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం

66 ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మెక్‌డోనాల్డ్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

భార‌త్‌లో బోరిస్ జాన్స‌న్ ప‌ర్య‌ట‌న కుదింపు

చంద్రుడిపై రోవ‌ర్‌ను పంపేందుకు జ‌పాన్‌తో జ‌త‌క‌ట్టిన అర‌బ్ ఎమిరేట్స్

జూన్ 1 నుంచి హాల్‌మార్క్ న‌గ‌లే అమ్మాలి..

ఆప్రికాట్ పండ్ల‌తో ఆరోగ్యం

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమెరికా పార్ల‌మెంట్‌లో అంబేడ్క‌ర్‌కు నివాళులు

ట్రెండింగ్‌

Advertisement