e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News అభివృద్ధిని చూసి ఆగమైతున్నరు..

అభివృద్ధిని చూసి ఆగమైతున్నరు..

అభివృద్ధిని చూసి ఆగమైతున్నరు..

స్వరాష్ట్రంలోనే ఆలయాలకు పూర్వవైభవం
అబద్ధాలు మాట్లాడితే నాలుక కోసేస్తాం..
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం..
మీ మాయమాటలను ప్రజలు నమ్మరు..
పనీపాట లేనోళ్లు ధర్నాలు చేస్తున్నరు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌, జూలై 15: “అభివృద్ధిని చూసి కొందరు గిట్టని వారు ఆగమైతున్నరు. అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం.. నాలుక కోసేస్తాం.. పనీపాట లేకుండా నలుగురైదుగురిని వెంబడేసుకొచ్చి కారు కూతలు కూస్తే అయిపోయిందా? మేము గుడులు కట్టిస్తున్నామా? గుడిలోని లింగాలను మింగుతున్నామా? అన్నది ప్రజలు గమనిస్తున్నారు.” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తాజాగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ నిర్మల్‌ జిల్లాకేంద్రంలో కొందరు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా గండిరామన్న దత్తసాయి ఆలయంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మాట్లాడారు.

రాష్ట్రంలో అభివృద్థిని చూసే విపక్ష పార్టీల నాయకులు ఆగమైతున్నరని రాష్ట్ర అటవీ, పర్యావర ణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రె డ్డి అన్నారు. పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయం లో రూ.25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాన్ని గురువారం చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి అల్లోల దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వా గతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి దంప తు లు పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, నిర్మల్‌ జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్నదని చెప్పారు. జిల్లాలో రూ.50 కోట్ల నిధులను ఖర్చు చేసి 600 ఆలయాలను నిర్మించుకున్నామని చెప్పారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల్లో రైతులు వ్యవసాయంలో బిజీగా ఉంటే కొందరికి గిట్టడం లేదని విమ ర్శించారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న తమపై కొం దరు పనిగట్టుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మం డిపడ్డారు. నలుగురిని వెంబడేసుకొని ప్రజలను మభ్య పెట్టే ందుకు జిల్లాకు వచ్చి ధర్నాల పేరిట నాటకాలాడుతూ తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పనీపాట లేనోళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త మురళీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్‌ రెడ్డి, డీ శ్రీనివా స్‌, ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కాడి జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌ హయాంలోనే..
సారంగాపూర్‌, జూలై 15: ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని ప్యారమూర్‌ గ్రామంలో శ్రీ దత్తసాయి మందిరానికి రూ. 50లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. నిర్మల్‌ జిల్లాలో 500 దేవాలయాలకు నిధులు మం జూరు చేసి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారు, అడెల్లి పోచమ్మ దేవాలయాలకు నిధు లు మంజూరు చేసి భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో రూ. 10లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటా రు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌కు చెందిన చిన్నారి మహర్షిక చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, మంత్రి సోదరుడు అ ల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మ హిపాల్‌రెడ్డి, జడ్పీటీ సీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ నల్లావెంకట్‌రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్‌ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్‌ అయిర నారాయణరెడ్డి, ఆలూర్‌ సొసైటీ చై ర్మన్‌ మాణిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మం డల కన్వీనర్‌ మాధవరావు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మల్లయ్య, ఆలూర్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మ హిపాల మురళీకృష్ణ, సర్పంచ్‌లు ఉప్పాలపు దివ్య, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీలు లయ, మహిపాల్‌ వనజ, మండల కో-ఆప్షన్‌ మెంబర్‌ ఇస్మాయిల్‌, తహసీల్దార్‌ సంతోష్‌ రెడ్డి, ఎంపీడీవో సరోజ, ఏపీవో లక్ష్మారెడ్డి, పీఆర్‌ జేఈ శరత్‌, రాజ్‌మహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, భూమేశ్‌, రాజు, లింగారెడ్డి, సాగర్‌రెడ్డి, నర్సారెడ్డి, నాగభూషణ్‌, పాల్గొన్నారు.

బోదవ్యాధి నివారణకు..
నిర్మల్‌ చైన్‌గేట్‌, జూలై 15: రాష్ట్రంలో బోదకాలు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యక్ర మాన్ని మంత్రి తన నివాసంలో గురువారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్ల పై బడి న వారందరికీ డీఈసీ, అల్బెండజోల్‌ మాత్రలు వేయించాల న్నారు. జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌, నాయకులు రాంకిషన్‌ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, కార్యక్రమ నిర్వహణ అధికారు లు అరుణ్‌, శ్యాంకుమార్‌, డీఐవో అవినాశ్‌, జిల్లా ఉప వైద్యా ధికారి రవీందర్‌, సీహెచ్‌వో గిరిబాబు తదితరులున్నారు.

మున్సిపాలిటీని తీర్చిదిద్దుతాం
నిర్మల్‌ అర్బన్‌, జూలై 15: నిర్మల్‌ మున్సిపాలిటీని ఆద ర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అ న్నారు. మున్సిపాలిటీలో రూ.16 లక్షలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథ వాహనాన్ని గురువారం ప్రారంభించారు. కా ర్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్య క్షుడు మారుగొండ రాము, ప్రముఖ వ్యాపార వేత్త మురళీ ధర్‌ రెడ్డి, నాయకులు రాంకిషన్‌ రెడ్డి,కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధిని చూసి ఆగమైతున్నరు..
అభివృద్ధిని చూసి ఆగమైతున్నరు..
అభివృద్ధిని చూసి ఆగమైతున్నరు..

ట్రెండింగ్‌

Advertisement