హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు సైతం శుభాకాంక్షలు చెప్పారు. పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, నన్నపనేని నరేందర్ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.