మనిషి ఆరోగ్యం జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మెదడు ప్రత్యక్షంగా నియంత్రించే.. ఆకలి, జీవక్రియ మొదలైనవన్నీ ప్రొటీన్పైనే ఆధారపడి ఉంటాయంటారు
ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ప్రత్యేకించి, ఎక్స్ఆర్ఎన్-1 అనే ప్రొటీన్ లోపించినప్పుడు మెదడు ముందుభాగంపై తీవ్ర ప్రభావం పడుతుందట! దీంతో బాగా ఆకలి వేస్తుంది. ఫలితంగా కార్బొహైడ్రేట్లు, చక్కెర ఎక్కువ మోతాదులో తీసుకొంటారు. అందువల్లే చాలామంది ఊబకాయం బారినపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్లు అంచనా. కాబట్టి, ఎక్స్ఆర్ఎన్-1 ప్రొటీన్లోపం రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు తదితరాల్లో ఈ తరహా ప్రొటీన్ లభిస్తుంది.