Corona Third wave | కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది ! తొందరలోనే థర్డ్ వేవ్ కూడా వచ్చే ముప్పు కనిపిస్తోంది !! ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండండి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో పలువురు కరోనా మార్గదర్శకాలను పాటించడం మరిచిపోతున్నారు. కొంతమంది అయితే మాస్కులు లేకుండా ఇలా రోడ్లపై యథేచ్చగా తిరిగేస్తున్నారు. హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ ప్రాంతంలో పలువురు యువకులు ఇలా కనిపించారు.