bathukamma sarees | బతుకమ్మ పండుగ దగ్గరికొచ్చేస్తుంది. పెద్ద పండక్కి ఇంక రెండు నెలలే ఉంది. దీంతో ప్రతి ఏటా పండక్కి తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల తయారీలో వేగాన్ని పెంచారు. గడువులోగా చీరలను అందించేందుకు నేతన్నలు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. ఉపాధి లేక వలసలు పోయిన తమకు బతుకమ్మ చీరల ఆర్డర్‌తో చేతినిండా పనిదొరుకుతుందని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.