కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవీ ప్రాంతంలో కొత్త జలపాతం కనువిందు చేస్తున్నది. సుమారు 60 అడుగుల పై నుంచి కిందకు దుంకుతూ ఆకట్టుకుంటున్నది. జాలువారే ప్రాంతంలోని శిలలు.. అడవి దున్న తలను పోలి ఉండటంతో దీనికి టైసన్ జలపాతంగా అటవీ అధికారులు నామకరణం చేశారు.