ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 8374 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం ఇన్ఫ్లో 13178 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం సాయంత్రం.. ప్రాజెక్టు 2 ,4, 7, 8, 11వ నంబరు క్రస్టు గేట్లను ఒక్కో గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 12938.74 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.