ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా, 28 గేట్లతో నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నానికి 2.12 లక్షల క్యూసెక్కులకు పైగా న మోదుకాగా, సాయంత్రానికి 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకు చేరుకున్నది. 25 గేట్లు ఎత్తి 1.70 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.