రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉండగా, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.