Hariyal | సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కనిపించే పావురాలను చూడండి. విచిత్రంగా ఉన్నాయి కదూ ! పసుపు కాళ్లు కలిగి ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పావురాళ్ల శాస్త్రీయ నామం ట్రెరాన్ ఫోనికోప్టెరా. దీన్ని మరాఠీలో హోలా లేదా హరియల్ అంటారు. మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్లో ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ పావురాలు ఆదిలాబాద్ జిల్లా బూర్నూర్ అటవీ ప్రాంతంలో గురువారం నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కాయి.