పంజరం నుంచి బయటపడ్డ చిలుకలా.. ఎంతో సంతోషంగా గెంతులేస్తున్న ఈ ఫొటోలోని చిన్నారి ఓ అఫ్గాన్ బాలిక. తాలిబన్ మూకల నుంచి తప్పించుకొని.. బెల్జియం ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో దిగగానే ఇలా స్వేచ్ఛా ఆనందపు పారవశ్యంలో ఆ పాప మునిగిపోయింది. ‘బెస్ట్ ఫొటో ఆఫ్ ది ఇయర్’గా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రంపై బెల్జియం ప్రధాని ట్వీట్ చేశారు. ‘శరణార్ధులను కాపాడితే వచ్చే ఆనందం ఇలాగే ఉంటుంది. ఓ చిన్నారీ.. బెల్జియం నీకు స్వాగతం పలుకుతోంది’ అంటూ మురిసిపోయారు.