First Made-In-India Aircraft Carrier Vikrant | భారత రక్షణ రంగంలోకి అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సీ ట్రయల్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పుతో 45 వేల మెట్రిక్ టన్నుల బరువు ఉన్న విక్రాంత్‌ను ఇండియన్ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది. దీంతో అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ తర్వాత విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్ట మొదటి నౌక విక్రాంత్. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమైంది.