గిజిగాడు.. గుప్పెడంత పిట్టనే .. కానీ దాని గూడు చూస్తే మాత్రం అబ్బా అనాల్సిందే. దాని పనితనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ! గడ్డి పరకలు, పుల్లలు ఏరుకొచ్చి ఒక్కొక్క పోచతో ఎంతో శ్రద్ధగా అళ్లే గూళ్లు గొప్ప ఆర్కిటెక్చర్లనే మించిపోతాయి. అలాంటి ఒక్క గూడును చూస్తేనే ఆహా అని మురిసిపోతుంటాం.. కానీ ఈ ఈత చెట్టుపై చూడండి.. ఒకే చెట్టుపై పదుల సంఖ్యలో గిజిగాళ్లు కట్టిన గూళ్లు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఆ దారిగుండా వెళ్లే వారిని ఆ పిట్టల కిలకిల రావాలు ఆకట్టుకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కిందీ దృశ్యం.