ఎర్రటి ఎండ అయితేనేం.. అవసరం అలాంటిది! సర్కార్ దవాఖానాకు పోయి సూపెట్టుకోవల్లె.. గోలీలు తెచ్చుకోవల్లె.. కానీ సోపతి ఎవ్వరూ లేకపాయె.. పాపం ఏం చేస్తది ఆ అవ్వ!! ఒక్కతే అయిపాయె !! ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో సంచి పట్టుకుని మెల్లగా దవాఖానాకు బయలెల్లింది.. కానీ రోడ్డు మీద స్పీడుగా వస్తున్న బండ్లకు రోడ్డు దాటుడు ఆమెతో అయితదా!! ఆ ట్రాఫిక్కు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్న ఆ అవ్వను చూసిన ఓ ట్రాఫిక్ పోలీస్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. రోడ్డు దాటించి ఆ అవ్వ ఎక్కడికి పోవాల్లో కనుక్కొని ఆటో ఎక్కించి పంపించాడు. గోదావరిఖనిలోని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద శనివారం కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తులిప్ గార్డెన్ : కశ్మీర్ అందమిదీ..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ