బుధవారం 03 మార్చి 2021
National - Jan 23, 2021 , 00:59:54

గొగోయ్‌కి ‘జెడ్‌ప్లస్‌' భద్రత

గొగోయ్‌కి ‘జెడ్‌ప్లస్‌' భద్రత

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి కేంద్ర ప్రభుత్వం ‘జెడ్‌ప్లస్‌' వీఐపీ క్యాటగిరీ భద్రతను కల్పించినట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. దేశంలో ఆయన ఎక్కడకు ప్రయాణించినా 8-12 మంది సీఆర్‌పీఎఫ్‌ సాయుధ కమాండోలు భద్రత కల్పించనున్నట్టు తెలిపాయి. 2019 నవంబర్‌లో గొగోయ్‌ పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయనను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. 

VIDEOS

logo