శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 13:44:44

ఢిల్లీలో పెరిగిన క‌రోనా కేసులు.. పూర్తిగా నిండిన ఐసీయూ బెడ్‌లు

ఢిల్లీలో పెరిగిన క‌రోనా కేసులు.. పూర్తిగా నిండిన ఐసీయూ బెడ్‌లు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విస్త‌రిస్తున్న‌ది. శుక్ర‌వారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 7,178 కేసులు న‌మోదయ్యాయి. దీంతో న‌గ‌రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఐసీయూ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో సైతం ఐసీయూ బెడ్‌లు ఖాళీగా లేవు. విత్ వెంటిలేట‌ర్‌గానీ, వితౌట్ వెంటిలేట‌ర్‌గానీ ఐసీయూ బెడ్‌లు ఖాళీ లేవ‌ని ఆస్ప‌త్రులు చెబుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితి ఢిల్లీలో మౌలిక స‌దుపాయాల దుస్థితిని తెలియ‌జేస్తున్న‌ది.

ప్ర‌స్తుతం ఎయిమ్స్‌లో 56 ఐసీయూ బెడ్‌ల‌కుగాను ఒక‌టి, మ్యాక్స్ స‌మ్ర‌త్ గుజ‌ర్‌మాల్ మోదీ ఆస్ప‌త్రిలో 51 ఐసీయూ బెడ్‌ల‌కుగాను నాలుగు ఖాళీగా ఉన్నాయి. క‌రోనా వార్డుల్లోనేగాక సాధార‌ణ వార్డుల్లో సైతం ఐసీయూ బెడ్‌లు ఎక్కువ‌గా అందుబాటులో లేవు. సాధార‌ణ వార్డుల్లో మొత్తం 1546 ఐసీయూ బెడ్‌ల‌కుగాను ప్ర‌స్తుతం కేవ‌లం 354 బెడ్‌లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఐసీయూ బెడ్‌లు ఖాళీగాలేని ప్ర‌స్తుత స‌మ‌యంలో కేసులు పెరిగితే ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని, అందువ‌ల్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎవ‌రికి వారు నిబంధ‌న‌లు క‌ఠినంగా పాటించాల‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ అధికారులు సూచిస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.