ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 18:55:53

షేరిట్‌కు పోటీగా 'జీ షేర్' యాప్‌! చైనాకు గ‌ట్టి స‌వాలే..

షేరిట్‌కు పోటీగా 'జీ షేర్' యాప్‌! చైనాకు గ‌ట్టి స‌వాలే..

చైనా యాప్‌ల‌కు దీటుగా దేశీయ యాప్‌లు ఒక్కొక్క‌టిగా రంగంలోకి దిగుతున్నాయి. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత చైనాపై భార‌తీయులు మండిప‌డుతున్నారు. వారి వ్యాపారాన్ని దెబ్బ‌తీసే ప‌నిలో చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా 'చింగారి' రాగా తాజాగా షేరిట్ యాప్‌ను త‌ల‌ద‌న్నేలా  'జీ షేర్' వ‌చ్చేసింది.

క‌ర్ణాట‌క‌కు చెందిన శ్ర‌వ‌ణ్ ఈ యాప్‌ను రూపొందించారు. ఇంట‌ర్‌నెట్ లేకుండానే ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్‌, ఫైల్స్‌ను పంపించుకునేలా డిజైన్ చేశారు. అంతేకాదు 'Z SHARE' యాప్‌కు ప్లేస్టోర్‌లో 4.9 రేటింగ్ ఉంది. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత చైనా యాప్‌ల‌కు ప్ర‌త్యామ్నాయం క‌నిపెట్టాల‌నుకున్నాన‌ని శ్ర‌వ‌ణ్ హెగ్డే చెప్పుకొచ్చాడు. logo