బుధవారం 15 జూలై 2020
National - Jun 26, 2020 , 19:10:08

ముంబై పేలుళ్ల దోషి యూస‌ఫ్ మెమ‌న్ మృతి

ముంబై పేలుళ్ల దోషి యూస‌ఫ్ మెమ‌న్ మృతి

ముంబై: 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసఫ్‌​ మెమన్‌ మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాసిక్‌ రోడ్డు జైలులో యూసఫ్‌ మృతి చెందినట్టు జైలు అధికారులు శుక్ర‌వారం తెలిపారు. ఈ విషయాన్ని నాసిక్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వాస్‌ నాంగ్రే పాటిల్‌ కూడా ధ్రువీకరించారు. అయితే యూసఫ్‌ మృతికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం అతని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ధూలేకి తరలించారు. ముంబై పేలుళ్ల మాస్టర్‌ మైండ్, ప్రస్తుతం పరారీలో ఉన్న‌ టైగర్‌ మెమన్‌కు యూసఫ్ మెమ‌న్ సోదరుడు. 

ముంబై పేలుళ్ల కేసులో యూస‌ఫ్ మెమ‌న్‌కు స్పెషల్‌ టాడా కోర్టు జీవిత ఖైదు విధించింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 250 మంది మృతిచెందారు.  వందలాది మంది గాయపడ్డారు. కాగా, ఈ కేసులో దోషిగా ఉన్న టైగర్‌ మెమన్‌ మరో సోదరుడు యాకుబ్ మెమ‌న్‌‌కు 2015లో ఉరిశిక్ష అమలు జ‌రిగింది. 


logo