సోమవారం 13 జూలై 2020
National - Apr 15, 2020 , 17:54:48

'లేకపోతే బతక నివ్వడు!'

'లేకపోతే బతక నివ్వడు!'

అమరావతి: ప్రధాని మోదీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ట్విటర్లో పలు అంశాలపై ఆయన స్పందించారు. 

'ప్రధాని నరేంద్ర మోదీకి  నచ్చజెప్పి అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపిందెవరు?  ఆర్మీని దించక పోతే కరోనాతో పోతారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్ ను హెచ్చరించిందెవరు? బ్రిటిష్ ప్రధానికి కరోనా వచ్చిందని డాక్టర్లకు చెప్పిందెవరు?  నోట్: ప్రతి కొత్త ఆలోచన వెనక ఉన్నది ‘ఆయనే’ అని చదువుకోవాలి. లేకపోతే బతక నివ్వడు!' అని విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. logo