గురువారం 02 జూలై 2020
National - Apr 13, 2020 , 19:23:49

టీడీపీ పాలనలో దోచుకోవడమే..కానీ,

టీడీపీ పాలనలో  దోచుకోవడమే..కానీ,

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. టీడీపీ పాలనలో  దోచుకోవడమే కానీ ప్రజలకు పైసా విదిల్చింది లేదని విజయ సాయిరెడ్డి ఆరోపించారు. కరోనా కష్ట సమయంలో దానశీలులు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ప్రతి చోట అన్నార్తులకు  నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.  దాచుకోవడమే తెలిసినవాళ్లు దొంగల్లా పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నారని విమర్శించారు. 

యువ ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాల విస్తరణ వల్ల ఏపీలో కరోనా వ్యాధి అదుపులోకి వచ్చిందని ఎన్డీటీవీ  ప్రత్యేకంగా ప్రస్తావించిందని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో నియంత్రణ కట్టుదిట్టంగా సాగుతోందని ప్రశంసించిందన్నారు. ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా? అని విజయ సాయిరెడ్డి ట్విటర్లో వ్యాఖ్యానించారు. logo