శనివారం 29 ఫిబ్రవరి 2020
'కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు'

'కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు'

Feb 14, 2020 , 15:24:34
PRINT
'కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు'

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శించారు

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శించారు. చంద్రబాబు పీఎస్‌ ఇళ్లను ఐటీ అధికారులు సోదాలు చేస్తేనే వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందని..ఇంకా ఆయన బినామీలు, కాంట్రాక్టు సంస్థలపై దాడులు చేస్తే లక్షల కోట్లు దొరుకుతాయని ఆరోపించారు. 

'మహాత్మా గాంధీ లాంటివాడినని కటింగులిచ్చాడు. నిప్పు కణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలు పోయాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు. వ్యవస్థలన్నింటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేక పోయాడు. పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ ను చూసి ముంబాయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట. ఇప్పడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని' విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 


logo