శుక్రవారం 03 జూలై 2020
National - Jan 30, 2020 , 13:03:55

ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ..!

ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశాడు.

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి  ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశాడు. అమరావతిపై రెఫరెండం పెట్టాలని, వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి గెలవాలని చంద్రబాబు సవాల్ చేయడంపై విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి, రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే  మండలి  రద్దును సమర్థిస్తామని రంకెలు వేసే బదులు మీరంతా రాజీనామా చేసి గెలవండి. రిఫరెండంగా భావిస్తాం. నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం  తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చేయడు. ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ! 

చివరకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ ను అవమానించే ఉన్మాద స్థితికి చేరాడు చంద్రబాబు. మూడు పవిత్ర గ్రంథాలతో ఈనాడు అనే తన కుల పత్రిక సమానమని వ్యాఖ్యానించి రాష్ట్ర ప్రజలను అవమానించాడు. ప్రతి క్షణం మీ ప్రయోజనాలను పరిరక్షించినంత మాత్రాన దానికి ధార్మికతను ఆపాదిస్తే ఎలా బాబూ? అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo