శుక్రవారం 03 జూలై 2020
National - Jan 28, 2020 , 13:27:36

మండ‌లి రద్దు బిల్లును పార్లమెంటు తిరస్కరిస్తుందని కలలు కనొచ్చు

మండ‌లి రద్దు బిల్లును పార్లమెంటు తిరస్కరిస్తుందని కలలు కనొచ్చు

చంద్రబాబుకు పెద్ద సంకటమే వచ్చిపడింది. మునుపటిలా సోనియా, దీదీ, అఖిలేశ్, బెహన్జీ లాంటి వారిని కలిసి రాజ్యసభలో మండలి రద్దు బిల్లును అడ్డుకోండని కోరలేడు.

అమ‌రావ‌తి: 'ఎల్లో మీడియాకు నిర్ధిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం  చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి ‘జ్ఞానాన్ని’ వెదజల్లుతున్నాయ‌ని' వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి విమ‌ర్శించారు.  ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దుపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై విజ‌య సాయిరెడ్డి ట్విట‌ర్లో స్పందించారు. 

కాలభైరవ యాగాల తర్వాత క్షుద్ర‌ పూజలే మిగిలాయి. అవి కూడా కానిచ్చి ఫలితం కోసం నిరీక్షించండి. కౌన్సిల్ రద్దు బిల్లును పార్లమెంటు తిరస్కరిస్తుందని కలలు కనొచ్చు. రాజధాని భూముల కోసం మీరు ప్రదర్శిస్తున్న నాటకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇంకోసారి వాతలు తప్పవు.

చంద్రబాబుకు పెద్ద సంకటమే  వచ్చిపడింది. మునుపటిలా సోనియా, దీదీ, అఖిలేశ్, బెహన్జీ లాంటి వారిని కలిసి రాజ్యసభలో మండలి రద్దు బిల్లును అడ్డుకోండని కోరలేడు. వాళ్లను కలిస్తే  బీజేపీ  ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ముందు నుయ్యి...వెనుక గొయ్యి ఆయన పరిస్థితి.  దత్తపుత్రుడు అలియాస్ బెత్తం  నాయుడి రియాక్షన్ ను ఎప్పటిలాగే సోషల్ మీడియా ముందుగానే ఊహించింది. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందే ఈయన “అమ్మా” అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత కదా! అని విజ‌య సాయిరెడ్డి  వ్యాఖ్యానించారు. 


logo