గురువారం 04 జూన్ 2020
National - Jan 27, 2020 , 14:57:39

మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా..

మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి   మాలోకాన్ని కూడా..

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని రద్దు చేస్తే చిట్టి నాయడు, ‘వెన్నుపోటు’ సహచరుడు నిరుద్యోగులవుతారని టీడీపీ అధినేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శించారు.

అమరావతి:   ఆంధ్రప్రదేశ్‌  శాసనమండలిని రద్దు చేస్తే  చిట్టి నాయడు, ‘వెన్నుపోటు’ సహచరుడు నిరుద్యోగులవుతారని టీడీపీ అధినేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శించారు.     ఏపీ రాజకీయ పరిణామాలు, శాసన మండలి రద్దుపై విజయ సాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. 

రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించాడు. ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగాడు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్ ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట! 

చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలై పోయాయి. కౌన్సిల్ రద్దుపై  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి   ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టింది. ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది.  సీఎం జగన్‌   విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయింది. గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారే.  మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి   మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు చంద్రబాబు అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo