గురువారం 09 జూలై 2020
National - Jan 24, 2020 , 13:43:37

''పప్పు నాయుడు రాజకీయ జీవితం ముగిసినట్టే''

''పప్పు నాయుడు రాజకీయ జీవితం   ముగిసినట్టే''

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో టీడీపీ నేత యనమల రామకృష్ణుడిని బాబు స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడు.

అమ‌రావ‌తి:  ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట‌ర్లో మరోసారి మండిపడ్డారు . అమరావతి రాజధాని..  రియల్ ఎస్టేట్ ఆలోచనతోనే మూడు ప్రాంతాల గురించి ఎన్నడూ ఆలోచించలేదని, వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నాడ‌ని  విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. 

'ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో టీడీపీ నేత యనమల రామకృష్ణుడిని స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడు బాబు.  బాస్ సీఎం  కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన ‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు. ఇప్పుడు కౌన్సిల్ ఇమేజిని కూడా బాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారు. అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది.  ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని చూస్తున్నావు గదా బాబూ! వెనకబడిన ఈ ప్రాంతాలు ఎప్పటికీ నీ కాలికింద చెప్పులాగే పడి ఉండాలా? నీ ధన దాహానికి వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా?' అని విజ‌య సాయిరెడ్డి మండిప‌డ్డారు.logo