గురువారం 09 జూలై 2020
National - Apr 15, 2020 , 17:59:25

'మోదీ మర్చిపోయి ఉంటాడని అనుకుంటున్నాడు'

'మోదీ  మర్చిపోయి ఉంటాడని అనుకుంటున్నాడు'

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇవాళ ట్విటర్లో పలు అంశాలపై ఆయన స్పందించారు.  'ప్రధాని నరేంద్ర మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు. ఆయన వినమ్రత అది. పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని' సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

'ఏం మొహం పెట్టుకుని ఏపీకి  వస్తాడు. మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీ   మర్చిపోయుంటాడని అనుకుంటున్నాడు. ఆయనది అపార జ్ఞాపకశక్తి. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరు.'  అని మరో ట్వీట్‌ చేశారు.

'పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని అప్పట్లో డప్పుకొట్టుకున్నాడు. క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశాడు. 3జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని ఎప్పుడో లేఖ రాశాడట. ఉదయం ఫోన్ వస్తే 4 గంటలు ఓపిక పట్టలేనోడు, లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉందని' విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. logo