శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 18:26:33

'విజిలెన్స్ దర్యాప్తుతో దొంగలంతా దొరుకుతారు'

'విజిలెన్స్ దర్యాప్తుతో దొంగలంతా దొరుకుతారు'

అమరావతి:  టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే అంతర్జాతీయ మీడియాతో వీడియో కాన్ఫరెన్స్‌ జరిపి ఉండేవాడని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పలు అంశాలపై ఆయన ట్విటర్లో  కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఏపనీ ప్రజల కోసం చేయడు. నిధులెలా నాకేయాలా అని ముందే స్కెచ్ వేసి శంకుస్థాపన చేస్తాడు. కేంద్ర ప్రాజెక్టు అయినా రాష్ట్రానిదైనా. మెడ్ టెక్ అప్పట్లోనే పూర్తి చేసి ఉంటే నెల ముందే కోవిడ్ చికిత్స పరికరాల ఉత్పత్తి ప్రారంభమయ్యేది. విజిలెన్స్ దర్యాప్తుతో దొంగలంతా దొరుకుతారు.

ఇప్పుడాయన ఉండుంటే ఇంటర్నేషనల్ మీడియాతో వీడియో కాన్ఫరెన్సు ఉండేది. ప్రధాని మోదీ వల్ల కానిది నేను అక్కడే తిని, పడుకుని టెస్ట్ కిట్లు తయారు చేయించా. ట్రంపునకూ వెంటిలేటర్లు పంపిస్తా అని ఒక రేంజిలో ఆడుకునేవాడు. డీలర్ షిప్పుల పేరుతో బ్రోకర్లను రంగంలోకి దించేవాడు. అని విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు. 


logo