సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 15:51:12

ఆ లేఖలు, లీకులు అందులో భాగమే..

ఆ లేఖలు, లీకులు అందులో భాగమే..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడటంపై ఆయన ట్విటర్లో స్పందించారు.

చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడకలలు కనడంలో వింతేమీ లేదు. తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమే.

స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలని యనమల  డిమాండు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. సీబీఐని నిషేధించినోళ్ళు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినోళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప. అని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  


logo