ఆదివారం 29 మార్చి 2020
National - Mar 16, 2020 , 14:05:56

మా దేవుడు బాబు అంతకంటే పెద్దోడు

 మా దేవుడు బాబు అంతకంటే పెద్దోడు

అమరావతి: కరోనా వైరస్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేయడంపై  అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ  నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన ‘స్లీపర్ సెల్స్’ కరాఖండీగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే పెద్దోడు. ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు’.

బాబూ... ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్వవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని  ఎన్నికలు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల  చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్.

న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కుల పెద్దకు ‘శరణ్య’మన్నాడు. ఇక ఎవరిని నమ్మాలి?  ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఈ ఊడిగం చేయడమేమిటి?  కరోనా సాకుగా దొరికిందా? నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సింది పోయి అడ్డంగా పడుకుంటే ఆగుతుందా? అని విజయ సాయిరెడ్డి విమర్శించారు. 


logo