బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 12:42:39

'కమాన్ చంద్రబాబూ..!'

'కమాన్ చంద్రబాబూ..!'

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను  మూసివేస్తున్నారు. ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో   ఎన్నికల   విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  తీరుపై  వైసీపీ  ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణితిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ.. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వేనని విజయ సాయిరెడ్డి సవాల్‌ చేశారు. 

చంద్రబాబు పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం. వైఎస్సార్ కాంగ్రెస్ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్‌పై  బురద చల్లడానికి దేనికైనా తెగిస్తారు. ఎల్లో మీడియా గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తోంది. తనే డబ్బు, మద్యం పంపిణీ చేయించి మన మీదకు నెట్టడానికి కుట్రలు పన్నుతాడు బాబు. అని విజయ సాయిరెడ్డి విమర్శించారు. 


logo