గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 11:44:55

బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా!

బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా!

అమరావతి: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.   ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా  స్పందించారు.  టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 59.85% అణగారిన వర్గాలకు బి-ఫారాలు ఇస్తారు. ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ. బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా!

రాష్ట్రంలోని 1.62 కోట్ల కుటుంబాలకు సంక్షేమ సాయం అందింది. ఏటా 16 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా సీఎం   జగన్ వెనకడుగు వేయలేదు. నీ జమానాలో ప్రజలను ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేశావా? సంతృప్త స్థాయిలో ఏ పథకమైనా అమలు చేశావా? ఎలక్షన్లకు ముందు ప్రలోభ పెట్టడం తప్ప. అని విజయ సాయిరెడ్డి విమర్శించారు. 


logo