గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 14:22:03

'మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి'

'మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి'

అమరావతి:  ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.   ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా  స్పందించారు.  టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు. 

ఎన్టీఆర్ ను కూలదోసిన కుట్రలో బాబు దోస్తు, యనమల గారిలో ఈ మధ్య అసహనం కట్టలు తెంచుకుంది. స్థానిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 59.85% రిజర్వేషన్లు అమలు చేయాలనుకోవడం బీసీలకు  ద్రోహం చేసినట్టట. ఎవరి ‘బిర్రు’ చూసుకుని ప్రతాపరెడ్డి కోర్టుకు వెళ్లాడో తెలియదనుకుంటున్నాడు. అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo