గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 14:12:05

'దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి'

'దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి'

అమరావతి:  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వంపై  చంద్రబాబు చేస్తున్న విమర్శలను   విజయ సాయిరెడ్డి  తిప్పికొట్టారు. 'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు. దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు.' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


logo
>>>>>>