మంగళవారం 07 జూలై 2020
National - Feb 22, 2020 , 14:35:03

'ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?'

'ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?'

ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న విమర్శలను విజయ సాయిరెడ్డి తిప్పికొట్టారు.

అమరావతి:   టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వంపై  చంద్రబాబు చేస్తున్న విమర్శలను   విజయ సాయిరెడ్డి  తిప్పికొట్టారు.  'మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తాడు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతాడు. ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దట. తన మాజీ పీఎస్‌  అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు.

ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి? మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడు.  ఇప్పుడిప్పుడే  తాగుడుకు దూరమై భార్యా పిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా  చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదు.' అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 

'అప్పుటి దాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ! '


logo