శనివారం 28 మార్చి 2020
National - Mar 03, 2020 , 13:20:55

'పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు..చేసేవి మాత్రం అణగదొక్కే పనులు'

'పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు..చేసేవి మాత్రం అణగదొక్కే పనులు'

అమరావతి:  టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.     ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా పలు అంశాలపై స్పందించారు.   

అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బయటపడింది. వారిని ఓటు బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్ మోహన్‌ రెడ్డి నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు.

'అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు. చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు.అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.


logo