మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 13:08:50

బాబు కళ్లలో ఆనందం కోసం..

బాబు కళ్లలో ఆనందం కోసం..

అమరావతి: 'భూముల కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నాడు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలాడు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే.' అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆయన ట్విటర్లో స్పందించారు.

పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమీషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష  అంటూ బట్టలు చించుకుంటున్నాడు. 

అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.

బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది. ఎంగిలి కూడు తిన్న విశ్వాసం కదా! యజమాని, బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరో ఏడాదిలో ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుంది. అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


logo