బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 17:42:05

''ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు''

''ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు''

అమరావతి:  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు  ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో  భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై విజయ సాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు.  

'ఏబీ వెంకటేశ్వరరావు  యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. చంద్రబాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు. రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత కేంద్ర మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి  జీవీఎల్ నరసింహరావుపై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం. '  అని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 


logo