శుక్రవారం 03 జూలై 2020
National - Feb 07, 2020 , 17:45:29

''ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!''

''ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!''

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా మోటార్స్‌ తరలిపోతుందంటూ రాయిటర్స్‌ వార్తాసంస్థ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా మోటార్స్‌ తరలిపోతుందంటూ రాయిటర్స్‌ వార్తాసంస్థ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో చంద్రబాబుపై   విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికి తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు.  బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు వస్తాయి త్వరలో. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!' అని విజయ సాయిరెడ్డి హెచ్చరించారు. 


logo