శుక్రవారం 03 జూలై 2020
National - Apr 27, 2020 , 12:43:21

'వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు..!'

'వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు..!'

అమరావతి: దేశంలోనే ప్రతి రోజూ అత్యధికంగా కోవిడ్ వైరస్ పరీక్షలు జరుపుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌  అగ్రస్థానానికి ఎగబాకిందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు.   ఇప్పుడున్న టెస్టింగ్ ల్యాబ్ లకు తోడు మిగిలిన జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఆదేశించారని చెప్పారు. ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి లభించిందని..అసాధారణ విజయాలివి. అని ఆయన పేర్కొన్నారు. 

'చంద్రబాబు  పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100  కోట్లే మిగిలాయి. కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గింది. వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు. లాక్ డౌన్ లో ఎవరూ ఇబ్బంది పడకూడదని సీఎం జగన్‌  అనేక చర్యలు తీసుకున్నారు. హామీలు నెరవేస్తున్నారు. అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉందని' విజయ సాయిరెడ్డి విమర్శించారు. 


logo