గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 12:46:37

ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు ఫీలవుతున్నాడు!

ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు ఫీలవుతున్నాడు!

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు,  ప్రతిపక్ష నేత చంద్రబాబుపై  వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి  విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ పేరు చెప్పి ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను చంద్రబాబు నిలిపివేయించాడని విజయ సాయిరెడ్డి ట్విటర్లో ఆరోపించారు.   

స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు ఫీలవుతున్నాడు చంద్రబాబు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు.

పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో! అని విజయ సాయిరెడ్డి తెలిపారు. 


logo